4, ఆగస్టు 2020, మంగళవారం

లక్షణగ్రంథాలూ - వృత్తసూచిక, వృత్తపత్రిక సంకలనాలూ

ముఖ్యమైన ఛందోలక్షణ గ్రంథాలనూ అవి దొరికే https://archive.org/ లింకులనూ ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తి కలవారు తప్పక download చేసుకో వలసిందిగా సూచన. ఆలస్యం చేస్తే ఏదో ఒకనాడు ఈ సైట్ కనుమరుగు కావచ్చును లేదా అందులో కొన్ని పుస్తకాలు కనుమరుగు కావచ్చును. ఇంటర్నెట్‌లో ముఖ్యసమాచారం కనిపించినప్పుడు బధ్ధకించకుండా తెచ్చుకొని దాచుకోవటం మంచి పధ్ధతి.

  1. కవిజనాశ్రయము
  2. కావ్యాలంకారచూడామణి
  3. అనంతుని ఛందము
  4. లక్షణసారసంగ్రహము
  5. అప్పకవీయము
  6. ఛందోంబుధి(కన్నడ)
  7. లక్షణశిరోమణి 

వీటిలో లక్షణశిరోమణి తప్ప మొదటి ఆరింటిలో లభించే వివిధవృత్తాల లక్షణాల సంకలితం చేసి ఒక వృత్తసూచిక అన్న చిన్న పొత్తం అంతర్జాలంలో ప్రస్తుతం లభిస్తున్నది. ఇది ఈమాట వెబ్ మాగజైన్ వారి సైట్‌లో ఉంది.

అంతర్జాలంలో ఛందోరత్నావళి అని ఒక సంకలనం లభిస్తున్నది. అది కూడా పరిశీలించండి.

ఇవే కాకుండా నాదగ్గర వృత్తపట్టిక అని ఒక డాక్యుమెంట్ ఉన్నది. దీనిని జే.కే.మోహనరావు గారు 2016వ సంవత్సరంలో నాకు పంపించారు. ఐతే ఈ పట్టికలో వివిధవృత్తాల పేర్లూ వాటి గురులఘుక్రమాలూ ఉటంకించబడ్డాయి కాని యతిస్థానాల వివరం ఏమీ తెలియజేయబడ లేదు. ఈ వృత్తపట్టికను తెలుగులిపిలో ఈబ్లాగులో ఉంచటం‌ జరుగుతుంది. అందులో కేవలం గుర్వంతం ఐన వృత్తాలను కూడా విడిగా యీ బ్లాగులో చూపుతాను. ఇవే దాదాపు వేయి వరకూ‌ ఉన్నాయి!

 ఈరోజు దుఃఖభంజన కవి విరచితమైన వాగ్వల్లభ అనే‌పుస్తకం ఒకటి ఆర్కీవ్ సైట్‌లో లభించింది. ఈ‌పుస్తకం నాగరి లిపిలో ఉన్న ఒక సంస్కృత గ్రంథం. ఈ‌ నాగరి లిపిని అనాయాసంగా చదవట‌ం‌ నా వల్ల కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి