నారి.
ఏమయ్యా
రామయ్యా
నా మోక్షం
బేమాయే
నారి అంటే వింటినారి కాదండోయ్. నారీవృత్తం. నారి అంటే సంస్కృతంలో స్త్రీ అని.
పాదానికి 3 అక్షరాలు. పొట్టి పద్యం. వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.
గురులఘుక్రమం UUU. అంటే ఒక్క మ-గణం మాత్రం.

వినయము.
శరణం
కరుణా
కర దా
శరథీ
కొనియా
డును రా
ముని నా
మనసే
ఈవినయ వృత్తానికి గురులఘుక్రమం IIU. అంటే ఒక్క స-గణం ఒక పాదంగా సరిపోతుంది. పాదానికి మూడే ఆక్షరాలు. ప్రాస మాత్రం తప్పదు వృత్తం కాబట్టి.
ఈ వినయవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.
బలాక.
వరాంగా
నరేశా
ధరాధీ
శ రామా
ఈ బలాక వృత్తం చాలాచాలా పొట్టిది. పాదానికి కేవలం మూడు అక్షరాలే ఉంటాయి. తమాషా ఏమిటంటే, యతిమైత్రి అంటూ అవసరం లేకపోయినా, వృత్తం కాబట్టి ప్రాసను పాటించవలసి రావటం.
ఈవృత్తానికి గురులగుక్రమం IUU. అంటే పాదానికి ఒక య గణం మాత్రమే అన్నమాట.
ఇతః పూర్వం ఈబలాకవృత్తాన్ని ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.