నంద.
ఓ మానసమా
రాముం డొకనిన్
ప్రేమించినచో
సేమం బగునే
వీరేంద్ర సురేం
ద్రారాధ్య పదా
శ్రీరామ మహా
కారుణ్య నిధీ
నంద వృత్తానికి పాదానికి 5 అక్షరాలు.
అందుచేత యతి మైత్రి స్థానం అవసరం లేదు
కాని వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.
ఈవృత్తానికి భ-లగ అని గణవిభజన.
అంతకన్నా గగ-స అని చెప్పటం సముచితంగా, ఉంటుంది.
అలా ఎందుకంటే ఈనందవృత్తం పాదంలో 8 మాత్రలు ఉంటాయి. కాబట్టి చతురస్ర గతి నప్పుతుంది సహజంగా. గగ-స అని పాదాన్ని రెండు ముక్కలుగా చూడటం వలన మంచి నడక సాధించవచ్చును.
మరొక విధంగా ఆలోచించరాదా అంటే భేషుగ్గా అలా చేయవచ్చును. అసమఖండాలుగా 5-3 మాత్రలతో నడక కూడా అందంగిస్తుంది. ఇలా రెండు విధాలైన నడకలను ఈపొట్టి వృత్తంలో సాధించవచ్చును. ఆయా నడకలను చూపుతూ రెండు ఉదాహరణలను ఇచ్చాను.

Wonderful sir today's posts
రిప్లయితొలగించండి