కరాళి.
జయ దీనజనావనా
జయ సత్యపరాక్రమా
జయ నిత్యయశోధనా
జయ రామ జనార్దనా
ఈ కరాళీవృత్తానికి కేతుమాల అని కూడా పేరుంది. దీని పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం IIUIIUIU. గణవిభజన స-స-వ అని.
ఈ కరాళీ వృత్తం చుట్టాలను పలకరిద్దాం. ఒక యాభై వృత్తాలున్నాయి బంధుగణం! దీని పాదం ముందొక లఘువును చేర్చితే అది కరశయావృత్తమూ అలా కాదని గురువును చేర్చితే అది మదనోధ్ధురా వృత్తం. దీని పాదం ముందు వ-గం చేర్చితే అది జరా వృత్తమూ ఆ వ_గణం చివర ఉంచితే అది సహజా వృత్తం. కరాళి పాదం చివర జ-గణం చేరితే అది జవనశాలిని, మ-గణం చేరితే అలితాగమనం, య-గణం చేరితే అది విమ. ఈకరాళి పాదం ముందు న-గణం చేరితే అది సమ్మదమాలిక, స-గణం చేరితే అది ఉపచిత్రం. ఇంకా బోలెడు చోట్ల ఈకరాళీ సంతకం కనిపిస్తుంది.
ఈ వృత్తం నడకను చూదాం. పాదంలో ఉన్నవి ఎనిమిది అక్షరాలు. పాదం మధ్యలో విరుపు కనిపిస్తోంది. ఉత్తరార్ధంలో ఆరు మాత్రలున్నాయి. పుర్వార్ధంలో ఐదే కాని కొంచెం సాగదీసి ఆరుగా పలకవచ్చును. జయ దీ..న అన్నట్లుగా. అప్పుడు మరింత కర్ణపేయంగా ఉంటుంది.
జయ దీన - జనావనా
జయ సత్య - పరాక్రమా
జయ నిత్య - యశోధనా
జయ రామ - జనార్దనా
17, ఆగస్టు 2020, సోమవారం
కరాళి / కేతుమాల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి