కేశవతి.
ధరాకన్యాపతివై
నరాధీశుండవుగా
ధరన్ జన్మించితివో
హరీ రాముండవుగా
మహాకోదండధరా
మహీకన్యాసహితా
మహాదేవాదినుతా
మహాత్మా రామ విభో
పరాకేలా కృపతో
మొరాలింపం దగురా
సురాధీశాదినుతా
హరీ శ్రీరామ విభో
ఈవృత్తం పాదానికి 7 అక్షరాలు.
గురులఘుక్రమం IUU UII U. అంటే య-భ-గ.
ఈ పద్యం నడకను చూదాం. ఇది IUU - UIIU అన్నట్లు నడుస్తున్నది. పాదానికి ఉన్నవి మొత్తం 11 మాత్రలు. ఇవి సమద్విభాగం చేదామంటే 5 మాత్రలు పూర్వార్ధంగానూ 6 మాత్రలు ఉత్తరార్ధంగాను వస్తాయి. లేద తద్విపర్యయంగా వస్తాయి. ఉత్తరార్ధం 6 మాత్రలూ మరలా సమద్విఖండితంకావటం కూడా బాగుంటుది. ఉదహరణకు ఒక పద్యం చూదాం.
మహాకో - దండ - ధరా
మహీక - న్యాస - హితా
మహాదే - వాది - నుతా
మహాత్మా - రామ - విభో
ఇదీ కొద్ది పద్యాలు ప్రయత్నించి చూసిన తరువాత నాకు కనిపించిన నడక.
పద్యపాదం పొట్టిదే కాని మూడు గురువులు వరుసగా వేయటమే ఇక్కడ ఒక సవాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి