సింహరేఖ.
రూపమా వినీలమేఘం
చాపమా కృతాంతదండం
చూపులో కృపాప్రవాహం
తాపహారి రామతత్వం
ఇది భలే పొట్టివృత్తం. పాదానికి కేవలం 8 అక్షరాలే. దీనికి గణాలు ర - జ - గగ. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.
గురులఘుక్రమం ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే మరొక రకంగా చూస్తే (U I) (U I) (U I) (U U ). అంటే మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట. ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!
శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.
రామ రామా రామ రారా
రామ రా మా రామ రారా
రామ రా గారామ రారా
రామ రా శ్రీ రామ రారా.
ఇందులో పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో ఒకసారి చూడవచ్చును.
ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం. చిన్నపద్యంలో రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే కావటం వలన ఈ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.
ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ ప్రయత్నించండి.