ఉష్ణిక్ ఛందస్సులో పాదానికి 7 అక్షరాలు. కాబట్టి మొత్తం 27 = 128 వృత్తాలు యేర్పడతాయి. కాని తెలుగులో వృత్తం చివరి అక్షరం గురువు కావలసి ఉంది తప్పనిసరిగా. కాబట్టి అలా గురువు చివర ఉండే 64 వృత్తాలే మనం పరిగణన లోనికి తీసుకుంటున్నాం.
- IIIIIIU న-న-గ: మధుమతి మదనవిలసిత సులభం
- IIIIIUU న-స-గ: ధృతి
- IIIIUIU న-జ-గ: పురటి
- IIIIUUU న-య-గ: సురి
- IIIUIIU న-భ-గ: స్వనకరి మధుమతి
- IIIUIUU న-ర-గ: ఖరకర
- IIIUUIU న-త-గ: పరభృతం
- IIIUUUU న-మ-గ: హోల
- IIUIIIU స-న-గ: యమనకం
- IIUIIUU స-స-గ: కరభిత్
- IIUIUIU స-జ-గ: కఠోద్గత
- IIUIUUU స-య-గ: రసధారి
- IIUUIIU స-భ-గ: అధికారీ
- IIUUIUU స-ర-గ: భూరిధామ హంసమాలి హంసమాల సరళ
- IIUUUIU స-త-గ: మాయావిని
- IIUUUUU స-మ-గ: శంబూక
- IUIIIIU జ-న-గ: స్విద కుమారవిలసిత కుమారలలిత
- IUIIIUU జ-స-గ: కుమారలలిత
- IUIIUIU జ-జ-గ: వహిర్వలి
- IUIIUUU జ-య-గ: ??
- IUIUIIU జ-భ-గ: మహోధిక
- IUIUIUU జ-ర-గ: పురోహిత
- IUIUUIU జ-త-గ: కుఠారిక
- IUIUUUU జ-మ-గ: పద్యా / సుమోహిత
- IUUIIIU య-న-గ: చిరరుచి
- IUUIIUU య-స-గ: మహనీయ
- IUUIUIU య-జ-గ: మహోధ్ధత
- IUUIUUU య-య-గ: అభీకం లోల
- IUUUIIU య-భ-గ: కేశవతి
- IUUUIUU య-ర-గ: వయస్య
- IUUUUIU య-త-గ: ఊపికం
- IUUUUUU య-మ-గ: ప్రహాణ
- UIIIIIU భ-న-గ: ఉలప
- UIIIIUU భ-స-గ: రుచిరం సురుచిర
- UIIIUIU భ-జ-గ: ఉందరి
- UIIIUUU భ-య-గ: కిణపా
- UIIUIIU భ-భ-గ: మౌరలికం
- UIIUIUU భ-ర-గ: హోడపద
- UIIUUIU భ-త-గ: కల్పముఖి
- UIIUUUU భ-మ-గ: అధీరా
- UIUIIIU ర-న-గ: బహులయా
- UIUIIUU ర-స-గ: శరగీతి
- UIUIUIU ర-జ-గ: చామరం విభూతి సునామం
- UIUIUUU ర-య-గ: అహింసా
- UIUUIIU ర-భ-గ: సౌరకాంత
- UIUUIUU ర-ర-గ: హంసమాల
- UIUUUIU ర-త-గ: మృష్టపాద
- UIUUUUU ర-మ-గ: సిరవి
- UUIIIIU త-న-గ: హీరం
- UUIIIUU త-స-గ: స్థూల
- UUIIUIU త-జ-గ: పూర్ణ
- UUIIUUU త-య-గ: వేధా
- UUIUIIU త-భ-గ: నిర్వాధిక
- UUIUIUU త-ర-గ: భీమార్జనం
- UUIUUIU త-త-గ: రాజరాజీ
- UUIUUUU త-మ-గ: నిఘ్నాశయ
- UUUIIIU మ-న-గ: నవసర
- UUUIIUU మ-స-గ: మదలేఖ మదరేఖ
- UUUIUIU మ-జ-గ: మహోన్ముఖి
- UUUIUUU మ-య-గ: ఇభభ్రాంత
- UUUUIIU మ-భ-గ: వర్కరిత
- UUUUIUU మ-ర-గ: కిర్మీరం
- UUUUUIU మ-త-గ: హిందీరం
- UUUUUUU మ-మ-గ: శిప్ర
మనం ఈ సందర్భంలో పైన ఇచ్చిన అన్ని వృత్తాలనూ పరిశీలించ బోతున్నాం.