గాయత్రీ ఛందస్సులో పాదానికి 6 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 26 = 64 వృత్తాలు ఏర్పడతాయి. కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 32 మాత్రమే.
- IIIIIU న-స: సరి
- IIIIUU న-య: శశివదన
- IIIUIU న-ర: నిరసిక
- IIIUUU న-మ: గుణవతి
- IIUIIU స-స: తిలక
- IIUIUU స-య: కమని
- IIUUIU స-ర: మృదుకీల
- IIUUUU స-మ: అభిఖ్య
- IUIIIU జ-స: కుహీ
- IUIIUU జ-య: అజరస్క
- IUIUIU జ-ర: వళీముఖి
- IUIUUU జ-మ: కంజ
- IUUIIU య-స: మశగ
- IUUIUU య-య: సోమరాజి
- IUUUIU య-ర: కఛ్ఛపి
- IUUUUU య-మ: పంథా
- UIIIIU భ-స: సౌరభి
- UIIIUU భ-య: ఈతి
- UIIUIU భ-ర: శునకం
- UIIUUU భ-మ: సింధురయ
- UIUIIU ర-స: కర్మద
- UIUIUU ర-య: పికాళి
- UIUUIU ర-ర: విజోహ
- UIUUUU ర-మ: కరేణు
- UUIIIU త-స: వసుమతి
- UUIIUU త-య: తనుమధ్య
- UUIUIU త-ర: స్థాలి
- UUIUUU త-మ: వభ్రూ
- UUUIIU మ-స: నిస్క
- UUUIUU మ-య: తంత్రి
- UUUUIU మ-ర: అవోఢ
- UUUUUU మ-మ: విద్యుల్లేఖ
మనం క్రమంగా ఈ వృత్తాలన్నీ పరిశీలిద్దాం.