కలలి.
వినుము రామా
కనులు నిన్నే
కనగ కాంక్షిం
చును మహాత్మా
భలే చిట్టిపొట్టి వృత్తం. పాదానికి 5 అక్షరాలే. గురులఘుక్రమం IIIUU. అంటే గణవిభజన న-గగ అన్నమాట.
ఈ కలలి వృత్తపాదానికి ముందొక లఘవును చేర్చితే అది శశివదనావృత్తం. ముందొక గురువును చేర్చితే అది ఈతివృత్తం.
ఈకలలి వృత్తం పాదానికి ముందు రెండు లఘువులను చేర్చితే అది ధృతి వృత్తం.
పాదం
ముందు రెండు గురువులను చేర్చితే అది స్థూలవృత్తం.పాదం చివర రెండు
గురువులను చేర్చితే అది హోలావృత్తం. పాదం చివర ఒక గురువునే చేర్చితే అది
గుణవతీవృత్తం.
కలలి పాదానికి ఎడాపెడా చెరొక గురువును తగిలిస్తే అది కిణపావృత్తం.
కలలి పాదానికి ముందు ల-గ చేర్చితే అది కుమారలలితావృత్తం. ఆ ల-గ చివరన చేర్చితే అది పరభృతవృత్తం. పాదానికి ముందు గ-ల చేరిస్తే అది రుచిరవృత్తం.
ఈ కలలి గురులఘుక్రమం చిన్నది కాబట్టి సవాలక్ష వృత్తాల్లో అది ఇమిడిపోతుంది.
ఈ కలలి నడకను చూస్తే, చివరి గగ ముందు విరుపు కనిపిస్తున్నది. ఉదాహరణ ఇలా నడుస్తున్నది.
వినుము - రామా
కనులు - నిన్నే
కనగ - కాంక్షిం
చును మ - హాత్మా