లసదసు.
మన యెడల రాముడే
తన కృపను జూపగా
మన కభయ మీయగా
మన కిక జయంబులే
ఈ లసదసు వృత్తానికి మహి, కమల, వసన అన్న పేర్లు కూడా ఉన్నాయి. దీని గురులఘుక్రమం IIIIIUIU. అంటే గణవిభజన న-స-లగ.
ఈ లసదసు బంధుగణాన్ని చూదాం. ఈ వృత్తపాదం చివర మరొక గురువును చేర్చితే అది బింబ వృత్తం అవుతుంది. పాదం చివర ల-గ చేర్చితే అనుచాయిక, య-గణం చేర్చితే పంచశాఖి, ర-గణం చేర్చితే ప్రసృమరకర అవుతుంది. ఇంకా మరొక నలభైపైన వృత్తాల్లో ఈ లసదసు గురులఘుక్రమం కనిపిస్తుంది.
ఈ లసదసు యొక్క నడకను చూదాం. ఈవృత్తంలో మొత్తం పది మాత్రలున్నాయి. ఉన్న రెండు గురువులూ పాదం చివరకు సద్దుకున్నాయి. కాబట్టి ఐదేసి మాత్రలు ఒక ఖండంగా నడక కనవస్తోంది.
మన యెడల - రాముడే
తన కృపను - జూపగా
మన కభయ - మీయగా
మన కిక జ - యంబులే
15, ఆగస్టు 2020, శనివారం
లసదసు / మహి / కమల / వసన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)