ధర.
కారుణ్యమే
నీరూపమా
ధీరాగ్రణీ
శ్రీరాముడా
ఈధరా వృత్తం ఒక చిట్టి వృత్తం. పాదానికి నాలుగంటే నాలుగే అక్షరాలు.
గురులఘుక్రమం UUIU. అంటే త-గ అని సంప్రదాయిక గణవిభజన అన్నమాట.
పాదం నిడివి పదక్షరాలలోపు కాబట్టి యతిమైత్రి స్థానం అవసరం లేదు. కాని వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.
ఇంత చిన్న వృత్తంలోనూ నడక అన్నది విశేషంగా ఉంది. నడక ఒక రకంగా, పంచమాత్రాత్మికంగా ఉందనిపిస్తోంది. అదెలా అంటే UU(I)-IU(U) అన్నట్లు. అంటే పాదం రెండు ఖండాలుగా ఉండి, ఒక్కొక్క ఖండమూ ఐదేసి మాత్రల ప్రమాణంగా నడుస్తున్నదన్న మాట. మరొక రకంగా UU-IU(I) అన్నట్లు చతుర్మాత్రాత్మికంగా అనిపిస్తోంది.
పూర్వకవులు ఎవరన్నా ఈ ధరా వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.
7, ఆగస్టు 2020, శుక్రవారం
ధర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Following
రిప్లయితొలగించండిPlease tell about a poem with six letters. 2letter only shortest..
UIUUUU
రిప్లయితొలగించండిఇది కరేణువు అనే వృత్తం అండీ. చెప్తాను కొద్దిసేపట్లో.
తొలగించండి